
తాజా వార్తలు
ఖైరతాబాద్‌లో ట్రావెల్స్ నిర్వాహకుల ధర్నా
హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, క్యాబ్‌లపై పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రావెల్స్ నిర్వాహకులు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. కరోనా, లాక్డౌన్ కారణంగా బస్సులు నడవక ఆర్థికంగా నష్టపోయామని, ఇలాంటి పరిస్థితుల్లో పన్నులు కట్టలేమంటూ వాహన యజమానులు ఆందోళన చేపట్టారు. క్వార్టర్లీ ట్యాక్స్‌లు వెంటనే రద్దు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ట్రావెల్స్ నిర్వాహకులు భారీగా తరలిరావడంతో ఆర్టీఏ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
Tags :