తెలంగాణకు రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కోటా పెంపు
close

తాజా వార్తలు

Published : 16/05/2021 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణకు రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కోటా పెంపు

దిల్లీ: కరోనా నియంత్రణలోభాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, టీకాల సరఫరాను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న రెమ్‌డెసివిర్‌లను 5500 నుంచి 10500లకు పెంచుతున్నట్టు తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తుండటంతో 200 టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌ నుంచి, ఒడిశాలోని అంగుల్‌, పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి తెలంగాణకు ఆక్సిజన్‌ సరఫరా చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ను పీయూష్‌ గోయల్‌ కోరారు. టీకాలను కూడా పెద్ద మొత్తంలో సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని