oxygen cylinder: ఒక్క రూపాయికే!
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

oxygen cylinder: ఒక్క రూపాయికే!

లఖ్‌నవూ: రెండో దశలో కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. నేరుగా శ్వాస వ్యవస్థపై దెబ్బకొడుతుండటంతో రోగులకు ఆక్సిజన్‌ అవసరం విపరీతంగా ఉంటోంది. అయితే ప్రస్తుతం దేశంలో ప్రాణవాయువు కొరత ఏర్పడటంతో రోగులు అల్లాడిపోతున్నారు. వారిని కాపాడుకోవడం కోసం బాధితుల కుటుంబ సభ్యులు ఆక్సిజన్‌ ప్లాంట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా భావించి.. కొందరు నల్లమార్కెట్లో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి. ఒక్క రూపాయికే ఆక్సిజన్‌ సిలిండర్‌ నింపుతూ మానవత్వాన్ని చాటుతున్నారు.

హమీర్‌పుర్‌ జిల్లాలోని సుమేర్‌పుర్‌ పారిశ్రామిక ప్రాంతంలో గల రిమ్‌ఝిమ్‌ ఇస్పాత్‌ ఫ్యాక్టరీ యజమాని మనోజ్‌ గుప్తా తన ప్లాంట్‌లో రూపాయికే ఆక్సిజన్‌ సిలిండర్‌ను నింపుతూ ఎంతోమంది కొవిడ్‌ రోగుల ప్రాణాలు నిలుపుతున్నారు. మనోజ్‌ గుప్తా కూడా గతేడాది కొవిడ్‌ బారినపడ్డారు. అప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరతను చూసి ఎంతగానో చలించిపోయారట. అందుకే తనవంతుగా సాయం చేయాలని ముందుకొచ్చారు. 

నిజానికి తన ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను ఉచితంగా అందించాలని గుప్తా అనుకున్నారట. అయితే తమ ఉత్పత్తులకు బిల్లింగ్‌ చేయాల్సిన అవసరం ఉండటంతో కనీస ఛార్జీ కింద సిలిండర్‌కు రూపాయి చొప్పున తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తమ ప్లాంట్‌కు రోజుకు 1000 సిలిండర్లను రీఫిల్లింగ్‌ చేసే సామర్థ్యం ఉందని, అన్నింటినీ రూ.1 చొప్పున నింపుతున్నట్లు తెలిపారు. కరోనా రోగుల బంధువులు తమ ఆధార్‌కార్డ్‌, ఆర్‌టీ-పీసీఆర్‌ రిపోర్ట్‌ చూపిస్తే ఆక్సిజన్‌ సిలిండర్లు నింపుతున్నట్లు వివరించారు. గుప్తా గురించి తెలిసి.. లఖ్‌నవూ, ఝాన్సీ, బందా, లలిత్‌పూర్‌, కాన్పూర్‌ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆయన ప్లాంట్‌కు వెళ్తున్నారు. 

కరోనా కష్టకాలంలో గుప్తా చేస్తున్న ఈ సాయం ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టుతుండటంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతోంది..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని