అప్పటికి విగ్రహాలన్నీ బాగానే ఉన్నాయి: సీపీ
close

తాజా వార్తలు

Published : 04/01/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పటికి విగ్రహాలన్నీ బాగానే ఉన్నాయి: సీపీ

విజయవాడ: విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వద్ద ఉన్న సీతమ్మ వారి విగ్రహం ధ్వంసం ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని నగర సీపీ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని.. ఇప్పటికే నగరంలోని అన్ని ఆలయాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 5.30 గంటల తర్వాత పలువురు ఆటోడ్రైవర్లు సీతమ్మవారి గుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని వెళ్లారని.. అప్పటికి విగ్రహాలన్నీ బాగానే ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై విచారణ కొనసాగిస్తున్నామని సీపీ చెప్పారు. ఆలయాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు.

ఇవీ చదవండి..

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

ఓర్వలేకే ఈ తరహా దుశ్చర్యలు: ఏపీ మంత్రులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని