close

తాజా వార్తలు

Published : 12/01/2021 08:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమించాడు.. పెళ్లికి నిరాకరించాడు

మనస్తాపంతో యువతి బలవన్మరణం 

హైదరాబాద్‌ : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మోసపోయానని భావించి మనస్తాపం చెందిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామ పరిధిలో జరిగింది. గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన చిన్న కుమార్తె శ్రావణి(21)తో కలిసి ఉంటోంది. భర్త లక్ష్మారెడ్డి మెదక్‌ జిల్లా కోహిర్‌ మండలం పీచేరేగడిలో వేరుగా ఉంటున్నారు. బీకాం పూర్తి చేసి శ్రావణి ఇంటివద్ద ఉంటోంది. ఏడాదిన్నర క్రితం నుంచి పక్కింటిలో ఉన్న వెంకటరాం, శ్రావణిలు ప్రేమించుకుంటున్నారు. దీంతో శ్రావణి మేనమామ రాజేశ్వర్‌రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరని వెంకటరాం సమాధానం ఇచ్చాడు. అయితే ఇకపై శ్రావణి వెంట పడొద్దని హెచ్చరించాడు. కొంతకాలం ఆమె వెంట పడకుండా ఉన్నప్పటికీ రాజేశ్వరరెడ్డి చనిపోయాక 11 నెలల క్రితం మళ్లీ ఆ యువతి వెంటపడేవాడు. పలుమార్లు శ్రావణి తల్లి ఆ యువకుడిని తన కూతురుతో ఫోన్‌లో మాట్లాడవద్దని మందలించింది. ఈ విషయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదని శ్రావణి కొన్ని రోజులుగా బాధపడుతుండేది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి కిందకు దించి చూసేసరికి అప్పటికే శ్రావణి చనిపోయి ఉంది. తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి..
కిడ్నాప్‌ కేసులో మరో ముగ్గురి అరెస్టు

సంక్రాంతికి ఊరికెళ్తున్నారా.. జర భద్రం



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని