close
చంద్రయాన్‌-2 ప్రయోగం 22న

ఇస్రో ప్రకటన

శ్రీహరికోట, న్యూస్‌టుడే: వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈనెల 22న  చంద్రయాన్‌-2 ఉప్రగహాన్ని రోదసిలోకి పంపుతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు ప్రయోగ సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15న చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లాల్సిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక క్రయోజనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. క్రయోజనిక్‌ ఇంజిన్‌లోని హీలియం బాటిల్‌ జాయింట్‌ వద్ద లీకేజీని గుర్తించిన శాస్త్రవేత్తలు దాన్ని సరిచేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. శనివారం రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 నింగిలోకి దూసుకెళ్లనుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.