Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176453
            [news_title_telugu_html] => 

ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణ

[news_title_telugu] => ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణ [news_title_english] => [news_short_description] => అయిదురోజులుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి మొదలయ్యాయి. మంగళవారం రాత్రి ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల సంఘం (తన్హా) ప్రతినిధులతో వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ జరిపిన చర్చలు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/03gMDfoqBV8 [news_videoinfo] => |https://www.youtube.com/embed/03gMDfoqBV8 [news_sections] => ,27,26, ) )
ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణ - EENADU
close
ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణ

వైద్యమంత్రితో ప్రైవేటు ఆసుపత్రుల చర్చలు సఫలం
యథావిధిగా సేవలు కొనసాగిస్తామని ‘తన్హా’ ప్రకటన
ఈనాడు - హైదరాబాద్‌

అయిదురోజులుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి మొదలయ్యాయి. మంగళవారం రాత్రి ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల సంఘం (తన్హా) ప్రతినిధులతో వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతో సేవల కొనసాగింపునకు అంగీకరిస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రులు ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాల కింద తమకు సుమారు రూ. 1,500 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని, వాటిని వెంటనే చెల్లించాలంటూ తన్హా చేసిన ఆరోపణలపై వైద్యఆరోగ్యశాఖ స్పష్టమైన వివరణ ఇవ్వడంతో వివాదం సమసిపోయింది. నాలుగు రోజుల కిందట చర్చలకు ఆహ్వానించిన మంత్రి ఈటల సమక్షంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు చెల్లింపులకు సంబంధించిన గణాంకాలను తన్హా ప్రతినిధుల ముందుంచారు. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాల కింద ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 457 కోట్లు మాత్రమే బకాయిలున్నాయని పేర్కొంటూ ఆసుపత్రులవారీగా వివరాలను తన్హా ప్రతినిధులకు అందజేశారు. ఆ సమాచారం తమ వద్దనున్న సమాచారంతో సరిపోకపోవడంతో వాటిని సరిపోల్చుకుని మరోదఫా చర్చలకు హాజరవుతామని తన్హా వెల్లడించింది. మూడు రోజుల్లో దీనిపై విస్తృతంగా చర్చలు జరిపిన తన్హా ప్రతినిధులు చివరకు తాము పేర్కొంటున్నట్లుగా రూ.1500 కోట్ల బకాయిలు లేవని అంచనాకొచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి కూడా బకాయిల చెల్లింపులపై సానుకూల స్పందన రావడంతో.. మంగళవారం సమావేశమైన తన్హా బృందం ఆరోగ్యశ్రీ సేవల కొనసాగింపునకు మొగ్గుచూపింది.

ఆరోగ్యశ్రీనే మెరుగు: వైద్యమంత్రి
ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించడానికి తన్హా అంగీకరించిన అనంతరం మంత్రి ఈటల విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వరుసగా ఎన్నికల కోడ్‌ ఉండడం వల్ల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైంది. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ సేవల కోసం రూ. 560 కోట్లు చెల్లించింది. మరో రూ. 120 కోట్లు త్వరలో ఇవ్వనుంది. మిగతాది కూడా నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. బిల్లుల చెల్లింపులో ఇబ్బంది కలగకుండా ఓ కమిటీని నియమిస్తాం. ఆసుపత్రులతో ఒప్పందాల విషయంలో తన్హా కోరుతున్న సవరణలను పరిగణనలోకి తీసుకుంటాం. దేశం మొత్తం మీద మెరుగైన వైద్యసేవలందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణనే నంబర్‌వన్‌. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే ఆరోగ్యశ్రీ 100 రెట్లు మెరుగైంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు మాత్రమే వైద్యం అందించే ప్రణాళిక తయారుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 84 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీసేవలందిస్తోంది’’ అని మంత్రి చెప్పారు.

సేవలు కొనసాగిస్తాం: తన్హా అధ్యక్షులు రాకేశ్‌
మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని తన్హా అధ్యక్షులు డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు. చర్చల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న ఆసుపత్రులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకమనీ, దీనివల్ల మూడున్నర కోట్లమంది ప్రజలు లబ్ధిపొందుతున్నారని పేర్కొన్నారు.


వైద్యం కోసం రాత్రంతా నిరీక్షణ

వీరంతా సోమవారం రాత్రి నిమ్స్‌ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ ఓపీ కార్డుల కోసం వేచి చూస్తున్న వారు. రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది వైద్యం కోసం ఇక్కడికి వస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఓపీ కార్డులు ఇస్తారు. వీటి కోసం ముందు రోజు రాత్రే ఆస్పత్రికి చేరుకుని అక్కడే ఇలా కటిక నేలపైనే పడుకుని మరుసటి రోజు చికిత్స కోసం ఎదురుచూస్తుంటారు.

-ఈనాడు, హైదరాబాద్‌

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.