Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219008764
            [news_title_telugu_html] => 

పల్లవిస్తున్న పల్లెలు

[news_title_telugu] => పల్లవిస్తున్న పల్లెలు [news_title_english] => [news_short_description] => పల్లెలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తుంటే అక్కడి వాతావరణం మనస్సుల్ని ఎంతో ఆహ్లాదపరుస్తుంది. ప్రజల ఆరోగ్యాలు మెరుగ్గా ఉంటాయి. తెలంగాణ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,27,26, ) )
పల్లవిస్తున్న పల్లెలు - EENADU
close
పల్లవిస్తున్న పల్లెలు

పరిష్కారం దిశగా పారిశుద్ధ్య సమస్యలు
కలియ తిరుగుతున్న కలెక్టర్లు
మరో 25 రోజుల పాటు కార్యక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: పల్లెలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తుంటే అక్కడి వాతావరణం మనస్సుల్ని ఎంతో ఆహ్లాదపరుస్తుంది. ప్రజల ఆరోగ్యాలు మెరుగ్గా ఉంటాయి. తెలంగాణ పల్లెలు ఇప్పుడు అదే దిశగా పయనిస్తున్నాయి. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక.. ఇప్పుడు పల్లెల్ని దిశానిర్దేశం చేస్తోంది. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి.. వాటిని పరిష్కరించే కార్యక్రమాలు గత 5 రోజులుగా జరుగుతున్నాయి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా.. పచ్చదనాన్ని పెంచేలా కార్యక్రమాలను చేపట్టడం, ఆయా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించటం, పంచాయతీకి వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించటం, సరైన రీతిలో నిధులను వినియోగించటం వంటివి 30 రోజుల లక్ష్యాలు. కార్యాచరణలో భాగంగా ఏరోజున ఎలాంటి పనులు చేపట్టాలో ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది.

మొదటి రోజైన సెప్టెంబరు ఆరో తేదీన పల్లెల్లో గ్రామసభలను నిర్వహించి ప్రణాళిక ఉద్దేశాలను చెప్పడంతో ప్రజలకు తొలుతే ప్రభుత్వ ఉద్దేశాలు తెలిశాయి. ఇవే సభల్లో పంచాయతీ కో-ఆప్షన్‌ సభ్యుల, స్టాండింగ్‌ కమిటీల నియామకాలు పూర్తవ్వడంతో కార్యక్రమాలను మరింత ఎక్కువగా చేపట్టేందుకు వీలవుతోంది. కొత్తగా నియమితులైన సభ్యులతో సహా పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు రెండోరోజున తమ పరిసరాల్లో పర్యటించి సమస్యలను గుర్తించి.. మూడో రోజు నుంచి వాటి పరిష్కారానికి నడుం బిగిస్తున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల జ్వరాలు ప్రబలుతుండటంతో పారిశుద్ధ్యంపై అధికార, అనధికార యంత్రాంగమంతా దృష్టి సారించింది. మురుగు కాలువలను శుభ్రపరచడం, వాటి వెంటనున్న పిచ్చిమొక్కలను, కంపను తొలగించటం, దోమలు నిల్వ ఉండేందుకు ఆస్కారమున్న గుంతలను మట్టితో పూడ్చివేయటం వంటి పనులను గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రస్తుతం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్‌ అధికారుల నేతృత్వంలో ఏర్పాటవుతున్న 100 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు 30 రోజుల ప్రణాళిక అమలు తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలను చేపడతాయి.

రెండు రకాల బిరుదులు
కార్యాచరణ ప్రణాళికలోని మిగతా 25 రోజుల్లో కొన్ని వినూత్న కార్యక్రమాలు కనిపించనున్నాయి. గ్రామాల్లో కార్యక్రమాలకు రూ.5 వేలు మొదలుకొని విరాళం ఇచ్చేవారికి మాఊరి రాజు, మాఊరి మహారాజు, మాఊరి మహారాజ పోషకులు అని బిరుదులిస్తారు. పేర్లను నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు.
పరిశుభ్రతకు విఘాతం కలిగించేలా.. రోడ్లపై చెత్త వేసేవారికి రూ.500 జరిమానాతో పాటు చెత్తరాజు అనే బిరుదు, బహిరంగ మలవిసర్జన చేసిన వారికి జరిమానా.. చెంబురాజు అనే బిరుదు ఇస్తారు. విద్యుత్‌ చౌర్యం చేస్తే దొంగరాజు అని వ్యవహరిస్తారు.


కలెక్టర్‌, ఎస్పీ సైకిల్‌ యాత్ర

ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌తో కలిసి మంగళవారం 15 కిలోమీటర్ల మేర సైకిల్‌పై ప్రయాణించి శ్రమదానం చేశారు. గోవిందరావుపేట మండలం మచ్చాపూర్‌ గ్రామంలో మంగళవారం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనేందుకు సైకిల్‌పై వెళ్లి గ్రామస్థులను ఆశ్చర్యపరిచారు. ఇదేవిధంగా పలు జిల్లాల కలెక్టర్లు శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, గోవిందరావుపేట

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.