దిల్లీ ఎయిమ్స్‌లో చిన్నారులపై కొవాగ్జిన్‌ పరీక్షలు ప్రారంభం

ప్రధానాంశాలు

దిల్లీ ఎయిమ్స్‌లో చిన్నారులపై కొవాగ్జిన్‌ పరీక్షలు ప్రారంభం

దిల్లీ: పిల్లలపై కొవాగ్జిన్‌ టీకాను పరీక్షించే ప్రక్రియను దిల్లీలోని ఎయిమ్స్‌ సోమవారం ప్రారంభించింది. 2-18 ఏళ్ల పిల్లలపై ఈ ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యవంతులైన చిన్నారులను ఎంపిక చేసేందుకు స్క్రీనింగ్‌ను చేపట్టినట్లు ఎయిమ్స్‌ తెలిపింది. ఆ ఫలితాలను బట్టి ఎంపిక చేసిన వాలంటీర్లకు టీకాను ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చి పరీక్షించనున్నారు. 525 మంది చిన్నారులపై ప్రయోగాలు చేపట్టనున్నారు. తొలి డోసు ఇచ్చిన 28వ రోజున రెండో డోసు ఇవ్వనున్నారు. ఇప్పటికే పట్నాలోని ఎయిమ్స్‌లో చిన్నారులపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలయ్యాయి. 2-18 ఏళ్ల పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా రెండు, మూడు దశల ప్రయోగ పరీక్షలకు.. ఔషధ నియంత్రణ సంస్థ గత నెల 12న అనుమతినిచ్చింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని