Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 110762
            [news_title_telugu_html] => 

కిమ్‌ సోదరుడిని అందుకే హత్య చేశారా?

[news_title_telugu] => కిమ్‌ సోదరుడిని అందుకే హత్య చేశారా? [news_title_english] => Kim Jong nam half-brother of North Korean leader was a CIA informant [news_short_description] => ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్‌ జోంగ్‌ నామ్‌ 2017లో దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. మలేషియాలోని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో... [news_tags_keywords] => Kim Jong nam,Kim Jong-un,North Korea [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 01:37:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కిమ్‌ సోదరుడిని అందుకే హత్య చేశారా? - Kim Jong nam half-brother of North Korean leader was a CIA informant - EENADU
close

తాజా వార్తలు

కిమ్‌ సోదరుడిని అందుకే హత్య చేశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్‌ జోంగ్‌ నామ్‌ను 2017లో దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. మలేషియాలోని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఇద్దరు యువతులు నామ్‌పై విష ప్రయోగం చేసి చంపారు. ఎక్కువ మొత్తంలో వీఎక్స్‌ విషాన్ని ప్రయోగించడంతో గుండె, ఊపిరితిత్తులు శరీరంలోని ప్రధాన భాగాలపై తీవ్ర ప్రభావం చూపి మృత్యువాత పడేలా చేసింది. ఇందుకు వియత్నాం, ఇండోనేషియాకు చెందిన కారణమని ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. అయితే, నామ్‌ హత్యకు కారణమేంటో ఇప్పటివరకూ తెలియరాలేదు.

ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ ఒక ఆసక్తికర కథానాన్ని ప్రచురించింది. నామ్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ) ఏజెంట్‌గా పనిచేస్తున్నాడనే కారణంతోనే అతడిని దారుణంగా హత్య చేశారని పేర్కొంది. సోమవారం ప్రచురించిన కథనంలో ‘ఆ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తి అతనొక్కడే’ అంటూ కిమ్‌ జోంగ్‌ నామ్‌ను ఉద్దేశించిన రాసుకొచ్చింది. నామ్‌ హత్యకు ముందు మకావూలో ఉండేవాడు. అప్పుడు తరచూ సీఐఏ ఏజెంట్లను కలవడం, ఆ వ్యవహారాలను చక్కబెడుతుండేవాడని తెలిపింది. గతంలో నామ్‌ వ్యవహారశైలిన చూస్తే అతను సీఐఏకు పనిచేసేవాడని ఆరోపణలు ఉన్నా, అవి నిరూపణ అయిన సందర్భం ఒక్కటీ లేదు. తాజాగా, వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ రాసిన కథనం ఆ వదంతులకు మరింత బలాన్ని ఇచ్చింది. ఈ కథనంపై ఉత్తర కొరియా నేతలు సైతం స్పందించారు. నామ్‌ సీఐఏ ఏజెంట్‌ తప్పకుండా అయి ఉంటాడని అభిప్రాయపడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.