close

తాజా వార్తలు

వెస్టిండీస్‌ ఘన విజయం

శతకాలతో కదం తొక్కిన హెట్మెయిర్‌, షైహోప్‌

చెన్నై: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలో ఛేదించింది. షిమ్రన్‌ హెట్మెయిర్‌ (139; 106 బంతుల్లో 11x4, 7x6), షైహోప్‌ (102; 151 బంతుల్లో 7x4, 1x6) శతకాలతో చెలరేగడంతో కరీబియన్‌ జట్టు సునాయాస విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను శుభారంభం చేసింది. టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విండీస్‌ 11 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ ఐదో ఓవర్‌లోనే సునిల్‌ ఆంబ్రిస్‌(9)ను పెవిలియన్‌కు పంపి భారత శిబిరంలో ఆశలు రేపాడు. తర్వాత వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హెట్మెయిర్‌ తొలుత ఆచితూచి ఆడాడు. హోప్‌తో కలిసి నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించినా ఒక్కసారి కుదురుకున్నాక బ్యాట్‌ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఐదో శతకం పూర్తిచేసుకున్నాడు. సెంచరీ తర్వాత ధాటిగా ఆడిన హెట్మెయిర్‌ షమి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయస్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు. దీంతో 218 పరుగుల భారీ భాగస్వమ్యానికి తెరపడింది. అప్పటికే విండీస్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. అనంతరం హోప్‌, నికోలస్‌ పూరన్‌(29;23 బంతుల్లో 4x4)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

ఇదిలా ఉండగా తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (70; 88 బంతుల్లో 5x4, 1x6), రిషభ్‌పంత్‌(71; 69 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(4) విఫలమైనా రోహిత్‌ శర్మ(36) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో భారత్‌ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ స్థితిలో జోడీ కట్టిన పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, వీరిద్దరూ కీలక సమయంలో వెనువెంటనే ఔటయ్యారు. అనంతరం కేదార్‌ జాదవ్‌ (40; 35 బంతుల్లో 3x4, 1x6), రవీంద్ర జడేజా (21; 21 బంతుల్లో 2x4) ఆరో వికెట్‌కు 59 పరుగులు చేశారు. చివర్లో జాదవ్‌, జడేజా, శివమ్‌దూబె పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 287 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, కీమో పాల్‌, ఆల్జరీ జోసెఫ్‌ తలో రెండు వికెట్లు తీశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.