close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రూ.3,000 కోట్లు.. భారత్‌ బయోటెక్‌కు రూ.1,567 కోట్లు

అడ్వాన్సు కింద చెల్లించడానికి కేంద్రం ఆమోదం!

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. టీకాల ఉత్పత్తిని మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని రెండు ప్రధాన టీకా ఉత్పత్తి సంస్థలైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ- పుణె), భారత్‌ బయోటెక్‌ (హైదరాబాద్‌)లకు దాదాపు రూ.4,567 కోట్ల అడ్వాన్సు సదుపాయం కల్పించడానికి ముందుకొచ్చింది. ఇందులో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రూ.3,000 కోట్లు, భారత్‌ బయోటెక్‌కు రూ.1,567 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆమోదం తెలిపారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌-3 మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ కింద ఈ నిధులు సమకూరుస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు సోమవారం వివరించాయి.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు