కొత్త కేసులు 4,801.. మరో 32 మరణాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త కేసులు 4,801.. మరో 32 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ కొత్త కేసులు 4,801 నమోదయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెలువరించిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం మొత్తం కేసులు 5,06,988కు చేరాయి. మరో 32 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,803కు చేరింది. 7,430 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60,136 క్రియాశీల (యాక్టివ్‌) కేసులు ఉన్నాయి. 75,289 నమూనాల్ని పరీక్షించారు. మంగళవారం నాటి బులెటిన్‌ ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 756, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో 327, రంగారెడ్డిలో 325, నల్గొండలో 254, వరంగల్‌ అర్బన్‌లో 215, ఖమ్మంలో 196, నాగర్‌కర్నూల్‌లో 189 కేసులు నమోదయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు