close
Array ( ) 1

తాజా వార్తలు

దిల్లీలో బ్రిటీష్‌ ఎంపీకి చేదు అనుభవం

దిల్లీ: దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటీష్‌ ఎంపీ దెబ్బీ అబ్రహంస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఈ-వీసా రద్దైన కారణంగా భారత్‌లో ఆమెను అడుగు పెట్టేందుకు అధికారులు నిరాకరించారు. కశ్మీర్‌ అంశంపై ఏర్పాటైన ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌నకు నేతృత్వం వహిస్తున్న లేబర్‌ పార్టీ సభ్యురాలైన అబ్రహంస్‌ సోమవారం ఉదయం దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వీసా రద్దైన కారణంగా దేశంలో ప్రవేశానికి అధికారులు నిరాకరించారు. తన ఈ-వీసా గడువు 2020 అక్టోబర్‌ వరకు ఉందని, అయినా తన వీసాను రద్దు చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ఈ-వీసా నిరాకరణ విషయాన్ని ఇదివరకే సదరు ఎంపీకి తెలియజేశామని, అసలు విషయం తెలియకుండా ఆమె దిల్లీ వచ్చేశారని పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై అబ్రహంస్‌ ఆందోళన వ్యక్తంచేస్తూ గతంలో యూకేలోని భారత హైకమిషనర్‌కు లేఖ రాశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.