close

తాజా వార్తలు

Published : 03/08/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రలో 9500 మంది పోలీసులకు కరోనా!

ముంబయి: మహారాష్ట్రను కరోనా వైరస్‌ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. వైరస్‌ను ఎదుర్కోవడంలో ముందుండి విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులూ ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9566 పోలీసు సిబ్బంది ఈ వైరస్‌ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 103 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వైరస్‌ సోకిన మొత్తం పోలీసు సిబ్బందిలో 7,534 మంది ఇప్పటికే కోలుకోగా మరో 1929 మంది పోలీసులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రాజధాని ముంబయితో పాటు పుణె... తదితర నగరాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది.

ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే మరో 9600 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 31వేలు దాటింది. వీరిలో ఇప్పటికే 15,316 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 322 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2లక్షల 60వేల మంది కోలుకోగా మరో లక్షా 50వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 17లక్షలు దాటింది. వీరిలో 37,364 మంది చనిపోయారు.

ఇవీ చదవండి..
భారత్‌లో 37వేలు దాటిన మరణాలు..
2కోట్ల కొవిడ్‌ టెస్టులు..
గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి..!


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని