close

తాజా వార్తలు

ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

ముంబయి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌

దిల్లీ: ముంబయి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో  సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ముంబయి విమానాశ్రయంలో దించేశారు. ముంబయి విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఏ320నియో విమానం ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్‌లో సమస్య తలెత్తినట్లు సందేశాన్ని గుర్తించిన పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా దించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రయాణికులందరు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ వారంలో ఇది రెండో ఘటన. కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో ఏ320నియో విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ప్రస్తుతం ఇండిగో ఏ320నియో విమానాలని ఎక్కువగా ఉపయోగిస్తుంది. వీటిలో ఉన్న తక్కువ పీడన టర్బైన్‌ను మార్చకోవాలని నవంబరులోనే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్ఏఏ) సూచించింది. వీటి కారణంగానే ఇంజన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నట్లుగా ఎఫ్‌ఏఏ అభిప్రాయపడింది. ఈ సంవత్సరం జనవరి చివర్లో డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌ (డీజీసీఏ) కూడా ప్రాటి అండ్‌ విట్నీ ఇంజిన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఇండిగో సంస్థకు సూచించింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.