ఆక్స్‌ఫర్డ్‌ టీకా: మరింత ఆలస్యమయ్యేనా..?

తాజా వార్తలు

Published : 29/12/2020 21:53 IST

ఆక్స్‌ఫర్డ్‌ టీకా: మరింత ఆలస్యమయ్యేనా..?

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యవసర అనుమతి ఇచ్చేందుకు యూరోపియన్‌ మెడిసిన్స్‌ అథారిటీ(ఈఎంఏ) సుముఖంగా లేదని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ అనుమతుల కొరకు ఇంకా సదరు సంస్థ దరఖాస్తు చేసుకోలేదని ఈఎంఏ డిప్యూటీ డైరెక్టర్‌ నియోల్‌ వాథియన్‌ బెల్జియన్‌ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేవలం వ్యాక్సిన్‌కు సంబంధించి కొంత సమాచారం మాత్రమే యూరోపియన్‌ నియంత్రణ సంస్థలకు చేరిందని ఆయన వెల్లడించారు.

‘వ్యాక్సిన్‌ మార్కెటింగ్‌ లైసెన్స్‌కు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడానికి కూడా ఈ సమాచారం సరిపోదు. వ్యాక్సిన్‌ నాణ్యతను తెలిపే పూర్తి సమాచారం నియంత్రణ సంస్థకు అవసరం. ఆ తరువాతే లైసెన్స్‌ కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోవాలి’ అని నియోల్‌ వాథియన్‌ పేర్కొన్నారు. వచ్చే నెలలోనే వ్యాక్సిన్‌కు అనుమతులు రావచ్చని వార్తలు వస్తోన్న తరుణంలో.. తాజా సమాచారంతో ఇది సాధ్యమయ్యే పనికాదని వాథియన్‌ అభిప్రాయపడ్డారు. అయితే, దీనిపై ఈఎంఏ మాత్రం అధికారికంగా స్పందించలేదు.

ఇదిలాఉంటే, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు ఈమధ్యే ఆస్ట్రాజెనెకా సీఈఓ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశ్లేషణ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్‌ ప్రయోగాల సమాచారాన్ని ఇప్పటికే నియంత్రణ సంస్థలకు అందించినట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించడం గమనార్హం.

ఇవీ చదవండి..
జనవరి తొలివారంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా?
భారత్‌లో ఈ వ్యాక్సిన్‌కే తొలి అనుమతి?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని