బీఎస్‌ఎఫ్‌ డీజీగా రాకేశ్‌ ఆస్తానా

తాజా వార్తలు

Published : 18/08/2020 01:56 IST

బీఎస్‌ఎఫ్‌ డీజీగా రాకేశ్‌ ఆస్తానా

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. మంగళవారం ఆయన డీజీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అదనపు డీజీగా ఉన్నారు. 1984 బ్యాచ్‌‌ గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఆస్తానా పేరు ‘సీబీఐ వర్సెస్‌ సీబీఐ’ వ్యవహారంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్తానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం అప్పట్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సీబీఐ నుంచి తొలగించారు. అయితే, సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దాణా కుంభకోణంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఆస్తానానే అరెస్ట్‌ చేశారు. అప్పట్లో ఆయన ఎస్పీగా ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని