
తాజా వార్తలు
అహంకారాన్ని వీడి.. రైతుల రుణం తీర్చుకోండి
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి మద్దతు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఇకనైనా ప్రభుత్వం అహంకారాన్ని వీడి అన్నదాతలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు.
‘మనకు అన్నం పెట్టే రైతన్నలు నేడు రోడ్డెక్కారు. ధర్నా చేస్తున్నారు. కానీ టీవీల్లో మాత్రం అబద్ధపు ప్రసంగాలు(ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కర్షకుల శ్రమకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. అలాంటి అన్నదాతలకు న్యాయం, హక్కులు కల్పించి రుణం తీర్చుకోవాలే గానీ.. వారిపై లాఠీఛార్జ్‌లు, బాష్పవాయువులు ప్రయోగించి కాదు. ఇకనైనా మేల్కోండి.. అహంకారమనే కుర్చీ నుంచి దిగి రైతులకు హక్కులు కల్పించండి’ అని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళన ఆరో రోజు కొనసాగుతోంది. పంజాబ్, హరియాణాకు చెందిన వేలాది మంది రైతులు ఇంకా దిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చర్చలకు రావాలని ఆహ్వానించింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
