యూఎస్‌లో వాతావరణ సదస్సు.. మోదీకి ఆహ్వానం!
close

తాజా వార్తలు

Published : 27/03/2021 15:30 IST

యూఎస్‌లో వాతావరణ సదస్సు.. మోదీకి ఆహ్వానం!

వాషింగ్టన్‌: పర్యావరణ పరిరక్షణ దిశగా అమెరికా మరో ముందడుగు వేసింది. వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యలు, తద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి చర్చించడానికి ఏప్రిల్‌ 22, 23న సదస్సు నిర్వహించనుంది. ఇందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ సహా 40 దేశాల అధినేతలకు ఆహ్వానం పలికింది. ఈ మేరకు శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

‘వాతావరణ మార్పులపై చర్యల గురించి చర్చించడానికి 40 దేశాధినేతలను సమావేశానికి ఆహ్వానించాం. ఈ ఏడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరగనున్న ఐరాస వాతావరణ మార్పుల(సీఓపీ26) సమావేశానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. భూతాపాన్ని 1.5డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేలా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడమే ఈ రెండు సదస్సుల లక్ష్యం. ఈ సదస్సును అవకాశంగా భావించి ఆయా దేశాధినేతలు వాతావరణ మార్పులపై తమ ఆశయాలను ఇక్కడ పంచుకోవాలని బైడెన్‌ విజ్ఞప్తి చేశారు’ అని శ్వేతసౌధం వెల్లడించింది. 

కాగా ఈ సదస్సుకు ప్రధాని మోదీతో పాటు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా, బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారో, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సహా పలు దేశాధినేతలను అమెరికా ఆహ్వానించింది. ఏప్రిల్‌ 22, 23న జరగబోయే ఈ సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారాలు చేయనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని