వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రకటనలు

తాజా వార్తలు

Updated : 26/04/2021 14:10 IST

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రకటనలు

కేంద్రంపై కేజ్రీవాల్‌ విమర్శలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్ప్‌షన్‌ (పీఎస్‌ఏ) మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేయడంలో కేంద్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రకటనలు చేస్తోందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. పీఎం కేర్స్‌ నిధులతో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ దిల్లీ సర్కారు స్థలాన్ని చూపడంలేదంటూ కేంద్రం చేస్తున్న వాదనంతా అసత్యమని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఇప్పటివరకు హస్తినలో కేవలం ఒక్క ప్లాంట్‌ మాత్రమే ఏర్పాటైనట్లు తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరాలో చోటుచేసుకుంటున్న ఆలస్యాన్ని నివారించేందుకు దిల్లీ సర్కారు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ముందుకు రావడంలేదని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా 162 పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుకు గత అక్టోబర్‌లోనే టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ నాటికే పూర్తిచేయాల్సిన ప్రక్రియను ఎందుకు ఇప్పటికి వరకు పూర్తిచేయలేకపోయిందని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. వీటిలో 140 ప్లాంట్ల ఏర్పాటు టెండర్‌ను ఒకే సంస్థకు ఇవ్వగా అది తప్పుకుందని.. ఫలితంగా 162లో దేశవ్యాప్తంగా 10 ప్లాంట్లు కూడా సిద్ధం కాని పరిస్థితులు తలెత్తాయని మండిపడ్డారు. చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా రాష్ట్రాలపై విమర్శలు గుప్పించి కేంద్రం పబ్బంగడుపుకోవాలని చూడటం ఏమిటని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. తాము వెంటబడి అడిగితే మార్చిలో ఒకే ఒక్క ప్లాంట్‌ని ఏర్పాటుచేశారని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని