Marriage: దిల్లీ హైకోర్టు జోక్యంతో ఒక్కటైన జంట!

తాజా వార్తలు

Published : 05/08/2021 23:05 IST

Marriage: దిల్లీ హైకోర్టు జోక్యంతో ఒక్కటైన జంట!

దిల్లీ: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను ఆమె తరఫు కుటుంబం బలవంతంగా లాక్కెళ్లిందని, ఎలాగైనా ఆమెను తనకు అప్పగించాలని కోరుతూ ఓ వ్యక్తి ఇటీవల దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసును ధర్మాసనం విచారణ చేపట్టడమే కాదు.. ఆమెను దగ్గరుండి అత్తారింట్లో వదిలిపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు కోర్టు జోక్యంతో ఆ భార్యాభర్తలిద్దరూ తిరిగి కలుసుకోగలిగారు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

దిల్లీకి చెందిన ఓ యువకుడు.. ఉత్తరప్రదేశ్‌లోని మిరెచీ ప్రాంతానికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని దిల్లీలోని ఆర్యా సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. అమ్మాయి కుటుంబసభ్యులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆమెని ఉత్తరప్రదేశ్‌లోని వారింటికి తీసుకెళ్లి గృహనిర్భందం చేశారు. దీంతో ఆమె భర్త దిల్లీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఎలాగైనా తన భార్యను తన ఇంటికి పంపించాలని పిటిషన్‌లో కోరాడు.  

ఈ పిటిషన్‌పై వర్చువల్‌గా విచారణ జరిపిన దిల్లీ ఉన్నత న్యాయస్థానం.. యువతిని ఆమె ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ఆ యువతి తన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని చెప్పడంతో ఆ దంపతులిద్దరినీ  ఒక్కటి చేయాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ మేరకు యువతిని దిల్లీకి తీసుకెళ్లి ఆమె భర్తకు అప్పగించాలని దిల్లీ, యూపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దిల్లీ పోలీసులు ఆమెను క్షేమంగా అత్తారింట్లో వదిలిపెట్టారు. కాగా.. ఇక నుంచి వారిద్దరికి భద్రత కల్పించాలని ఆనంద్‌ ప్రభాత్‌ పోలీసులకు కోర్టు సూచించింది. ఈ కేసులో భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడంతో హైకోర్టు ధర్మాసనం కూడా హర్షం వ్యక్తంచేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని