5G: ముందు ప్రభుత్వాన్ని సంప్రదించండి

తాజా వార్తలు

Published : 02/06/2021 22:01 IST

5G: ముందు ప్రభుత్వాన్ని సంప్రదించండి

దిల్లీ: దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా, వీరేశ్‌ మాలిక్‌, టీనా వచానీ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. 5జీ టెక్నాలజీలో ఉండే  రేడియేషన్ (ఆర్ఎఫ్) వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని.. మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ధర్మాసనం 5జీ టెక్నాలజీపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించారని పిటిషనర్లను ప్రశ్నించింది. ముందుగా ప్రభుత్వాన్ని సంప్రదించాలని, 5జీ టెక్నాలజీ వల్ల కలిగే నష్టాలను వివరించిన తర్వాత కూడా ప్రభుత్వం.. స్పందించకుంటే కోర్టును ఆశ్రయించాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. 

దేశంలో 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్‌).. ఇటీవల అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని