గుర్తించకపోతే మరిన్ని మహమ్మారులు

తాజా వార్తలు

Published : 27/05/2020 00:42 IST

గుర్తించకపోతే మరిన్ని మహమ్మారులు

బ్యాట్ ఉమెన్ హెచ్చరిక

బీజింగ్: ఇప్పటివరకు కనుగొన్న వైరస్‌ల సంఖ్య చాలా తక్కువని, వాటిని ముందుగానే గుర్తిస్తే ఇలాంటి మహమ్మారులను అడ్డుకోవచ్చన్నారు చైనా బ్యాట్ ఉమెన్‌ షి ఝెంగ్లి. అంటువ్యాధులను కట్టడి చేయడానికి అంతర్జాతీయ సహకారం చాలా అవసరమని, సైన్స్‌ను రాజకీయం చేయడం చాలా బాధాకరమని ఆ దేశంలోని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ వైరాలజిస్టు అయిన ఆమె వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

‘భవిష్యత్తులో మరోసారి ఇలాంటి అంటువ్యాధి రాకుండా అడ్డుకోవాలంటే, జంతువుల్లో ఉండే వైరస్‌ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో ముందుగానే ప్రపంచాన్ని అప్రమత్తం చేయొచ్చు. ఒకవేళ మనం ఈ విషయాన్ని పట్టించుకోపోతే, మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని షి హెచ్చరించారు. వైరస్‌లపై పరిశోధనలో శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. వైరస్‌ విషయంలో చైనా, అమెరికా మాటల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని సైన్సును రాజకీయం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి ప్రబలిన దగ్గరి నుంచి ఆ రెండు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే మనుషుల్లో వ్యాపించిన కరోనా వైరస్‌, తాను పరిశోధనలు జరిపిన వైరస్‌లలోని జన్యులక్షణాలకు సరిపోలడం లేదని షి వెల్లడించారు. ఈ మహమ్మారికి  వుహాన్‌ ల్యాబ్‌తో ఏ సంబంధం లేదని ఆమె తన సోషల్ మీడియా పోస్టు ద్వారా  వెల్లడించారు. ఆ ల్యాబ్ డైరెక్టర్ వాంగ్  కూడా ఆ ఆరోపణలు కల్పితమని తోసిపుచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని