Aryan Khan: ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ వాడుతుంటారు: ఎన్సీబీ

తాజా వార్తలు

Published : 15/10/2021 09:40 IST

Aryan Khan: ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ వాడుతుంటారు: ఎన్సీబీ

 బెయిలుపై తీర్పు 20కి వాయిదా 

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకుంటుంటారని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) తెలిపింది. బెయిలు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును వ్యతిరేకించింది. దీంతో బెయిలు పిటిషన్‌పై తీర్పును కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆర్యన్‌ జైల్లోనే ఉండనున్నారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన ఆర్యన్‌ బెయిలు కోసం చేసుకున్న దరఖాస్తుపై ప్రత్యేక కోర్టులో ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) అనిల్‌ సింగ్‌ గురువారం వాదనలు వినిపించారు. కొన్నేళ్లుగా ఆర్యన్‌ క్రమం తప్పకుండా డ్రగ్స్‌ వినియోగిస్తున్నారని చెప్పేందుకు సాక్ష్యాధారం ఉందన్నారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున ఇప్పుడు బెయిలు మంజూరు చేయడం సరికాదని పేర్కొన్నారు.  

కిరణ్‌ గోసావిపై లుక్‌ఔట్‌ నోటీసు: ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్న మాదకద్రవ్యాల కేసులో ప్రధాన సాక్షి కిరణ్‌ ప్రకాశ్‌ గోసావిపై పుణె పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేశారు. మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.3 లక్షలు తీసుకొని ఒకర్ని మోసం చేశారంటూ గోసావిపై 2018లో కేసు నమోదైంది. ఈ కేసులోనే ఆయనపై లుక్‌ఔట్‌ నోటీసు జారీ అయింది. అర్మాన్‌ కోహ్లికి బెయిలు నిరాకరణ : మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లికి ముంబయిలోని ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టు గురువారం బెయిలు నిరాకరించింది.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని