Kids On Bike: బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్నారా?

తాజా వార్తలు

Published : 26/10/2021 10:32 IST

Kids On Bike: బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్నారా?

అయితే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి..
కొత్త నిబంధనలతో కేంద్రం ముసాయిదా విడుదల 

ఈనాడు, దిల్లీ: ద్విచక్ర వాహనంలో వెనుక సీట్లో నాలుగేళ్లలోపు పిల్లల్ని కూర్చొబెట్టుకొని తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ సూచించింది. దీనికోసం కొత్త నిబంధనలు రూపొందించి వాటి ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. వీటిపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. నిబంధనలు ఖరారైన తర్వాత ఏడాది నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లలోపు చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు లైఫ్‌జాకెట్‌ లాంటి కొత్త తరహా జాకెట్‌ ధరించాలని పేర్కొంది. ఈ జాకెట్‌కు ఉన్న స్ట్రాప్స్‌ని డ్రైవర్‌ నడుము చుట్టూ బెల్టు మాదిరిగా బిగించాలని తెలిపింది. ఈ జాకెట్‌ తక్కువ బరువుతో, సర్దుబాటుచేసుకొనే విధంగా, వాటర్‌ప్రూఫ్‌గా ఉండాలని పేర్కొంది. స్ట్రాప్స్‌ గట్టి నైలాన్‌ మెటీరియల్‌తో, 30 కేజీల బరువును పట్టి ఉంచేంత బలంగా డిజైన్‌ చేయాలని తెలిపింది. చిన్నారులకు హెల్మెట్‌ను తప్పనిసరిగా పెట్టాలని పేర్కొంది. 4 ఏళ్లలోపు పిల్లలతో వెళ్తున్న ద్విచక్రవాహన వేగం 40 కిలోమీటర్లకు మించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈమేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలు 1989లో సవరణలు చేయనున్నట్లు పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని