మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు!

తాజా వార్తలు

Updated : 24/02/2021 11:21 IST

మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు!

దిల్లీ: భారత్‌లో కొత్త కొవిడ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన రోజుతో పోల్చితే కేసుల సంఖ్య కాస్త పెరిగింది. మంగళవారం 8.05లక్షల పరీక్షలు చేయగా.. 13,742 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,30,176కి చేరింది. కొత్తగా 14,037మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,07,26,702కు చేరి.. రికవరీ రేటు 97.25శాతంగా కొనసాగుతోంది.

ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,567కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  1,46,907 తగ్గింది. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4.20లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 1,21,65,598కి చేరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని