Covid Vaccination: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో ఘనత

తాజా వార్తలు

Published : 05/09/2021 16:53 IST

Covid Vaccination: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో ఘనత

ఆగస్టులో ‘జీ7’ దేశాలకంటే అధిక డోసుల పంపిణీ

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఒక్క ఆగస్టు నెలలోనే 18 కోట్లకు పైగా డోసులు వేసినట్లు కేంద్రం ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. అదే నెలలో జీ7 దేశాలు(కెనడా, యూకే, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్‌‌) అన్ని కలిపి ఇచ్చిన డోసుల సంఖ్య కంటే ఇది అధికమని పేర్కొంది. జీ7 దేశాలు 10.1 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చాయి. ‘ఇది మరో విజయం. ఆగస్టులో 18 కోట్లకు పైగా డోసులు ఇవ్వడం ద్వారా, వ్యాక్సినేషన్‌లో ముందు వరుసలో నిలుస్తూ.. భారత్‌ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది’ అని ట్వీట్‌లో పేర్కొంది. గత నెలలో ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు(27న, 31న) కోటికి పైగా డోసులు వేసి భారత్‌ సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

రాష్ట్రాల వద్ద 4.37 కోట్ల డోసులు ఉన్నాయి..

దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నానికి  68.54 కోట్లకుపైగా డోసులు ఇవ్వడం పూర్తయింది. ఇందులో 52.58 కోట్లు మొదటి డోసులు కాగా, 15.95 కోట్లు సెకండ్‌ డోసులు. మరోవైపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 4.37 కోట్లకుపైగా డోసులు నిల్వ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు 66.89 కోట్లకుపైగా డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు, ఇంకా 1.56 కోట్లకు పైగా డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని