Covishield: ‘కొవిషీల్డ్‌’ను గుర్తించిన మరో దేశం.. ఇక గ్రీన్‌ పాసులు పొందొచ్చు

తాజా వార్తలు

Published : 24/09/2021 19:34 IST

Covishield: ‘కొవిషీల్డ్‌’ను గుర్తించిన మరో దేశం.. ఇక గ్రీన్‌ పాసులు పొందొచ్చు

రోమ్‌: భారత్‌లో రూపొందించిన ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ను ఇటలీ శుక్రవారం అధికారికంగా గుర్తించింది. ఈ నిర్ణయంతో ఈ టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులు ఇప్పుడు ఆ దేశంలో గ్రీన్ పాస్‌ పొందొచ్చు. అక్కడి భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. జీ- 20 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం కోసం సెప్టెంబరు మొదటి వారంలో రోమ్‌కు వెళ్లిన సందర్భంగా దేశ ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. ఇటలీకి చెందిన రాబర్టో స్పెరాన్జాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొవిషీల్డ్‌కు గుర్తింపు, వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న భారతీయ విద్యార్థుల ప్రయాణాలు తదితర అంశాలపై చర్చించారు. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ సైతం సంబంధిత ప్రతినిధులతో వ్యాక్సినేషన్‌ విషయంలో మాట్లాడారు. ఈ క్రమంలో మంత్రి నిరంతర ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాల అధికారుల చొరవతో.. కొవిషీల్డ్‌కు గుర్తింపు దక్కిందని రాయబార కార్యాలయం పేర్కొంది.

ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయింపు..

ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్‌(ఈయూ)కు చెందిన 16 దేశాలు కొవిషీల్డ్‌ను గుర్తించాయి. ఈ గుర్తింపుతో.. సదరు టీకాలు తీసుకున్న వారు ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్‌ లేదా గ్రీన్‌ పాస్ పొందవచ్చు. ఈ పాస్‌ ఉన్నవారికి సదరు దేశాల్లో ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. మరోవైపు కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికుల క్వారంటైన్‌ నిబంధనల విషయంలో బ్రిటన్ తిరకాసు పెట్టిన విషయం తెలిసిందే. తమ సమస్య టీకాతో కాదని, టీకా ధ్రువపత్రంతో అంటూ చెప్పుకొచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దేశాలు జారీ చేసే టీకా ధ్రువీకరణ పత్రాలకు కనీస ప్రమాణాలుండాలని యూకే ప్రభుత్వం వ్యాఖ్యానించింది.  దీనిపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని