close

తాజా వార్తలు

Updated : 22/04/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపర్‌హీరోకు ‘జావా’

ఇంటర్నెట్ డెస్క్‌: రైల్వే పట్టాల మీదనుంచి చిన్నారిని కాపాడి, రైల్వేస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న మయూర్‌ షెల్కెకు బహుమతులు, ప్రశంసలు అందుతున్నాయి. మయూర్‌ను అభినందిస్తూ రైల్వే శాఖ యాభై వేల రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని బహుకరించింది. ఇదే కోవలో జావా మోటార్‌సైకిల్స్‌ అధినేత అనుపమ్‌ తరేజా జావా బైక్‌ను బహుమతిగా ఇస్తానని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘‘ మయూర్‌ షెల్కే ధైర్యాన్ని చూసి జావా కుటుంబం విస్మయానికి గురైంది. ధైర్య సాహసాలతో అదర్శంగా నిలిచిన అతనికి జావా మోటార్‌ సైకిల్‌ బహుమతిగా ఇచ్చి గౌరవించాలని అనుకుంటున్నాము’’ అని అనుపమ్‌ తరేజా ట్వీట్‌ చేశారు.  

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆనంద్‌ మహింద్రా అనుపమ్‌ తరేజా ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ‘‘ మయూర్‌ షెల్కె ప్రత్యేకమైన బట్టలు, టోపీ పెట్టుకోకపోయినా  సూపర్‌ హీరోలకన్నా ఎక్కువ ధైర్యాన్ని ప్రదర్శించాడు. మనమంతా జావా కుటుంబంతో కలిసి అతనికి సెల్యూట్‌ కొట్టాలి. కష్టసమయాల్లో మన చుట్టూ ఉన్న వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండటంవల్ల మంచి సమాజానికి బాటలు వేయొచ్చని మయూర్‌ నిరూపించాడు.’’ అని అన్నారు.

ఏప్రిల్‌ 17న ముంబై వాంగనీ రైల్వేస్టేషన్‌లో ఒక దృష్టిలోపమున్న మహిళ తన కొడుకుతో కలిసి ఫ్లాట్‌ ఫాం మీద నడుస్తుండగా, హఠాత్తుగా ఆ పిల్లాడు పట్టాల మీద పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ పాయింట్స్‌మ్యాన్‌ విధులు నిర్వర్తిస్తున్న మయూర్‌ షెల్కె తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ పిల్లాణ్ని కాపాడాడు. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని