కరోనా ఎఫెక్ట్: 2 రోజుల్లో.. 2.5 లక్షల పరీక్షలు

తాజా వార్తలు

Published : 16/04/2021 01:23 IST

కరోనా ఎఫెక్ట్: 2 రోజుల్లో.. 2.5 లక్షల పరీక్షలు

కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం

తిరువనంతపురం : కొవిడ్‌ ఉద్ధృతి దేశంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఎక్కడ నుంచి సోకుతుందో తెలియకుండానే వేల సంఖ్యలో జనాలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ సోకిన వ్యక్తులను గుర్తించి, వైరస్‌ వ్యాప్తికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో రెండున్నర లక్షల కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కొవిడ్ ఉద్ధృతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం పినరయి విజయన్‌ గురువారం ఈ నిర్ణయం ప్రకటించారు. 

విస్తృత పరీక్షలు, కఠిన నియంత్రణ, టీకాల పంపిణీలో భాగంగా దీన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. టెస్టులకు సంబంధించి జిల్లా యంత్రాంగం లక్ష్యాలు నిర్దేశించుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యోగులతో పాటు ప్రజా రవాణా, సేవ, వైద్య రంగాల్లోని సిబ్బందికి విధిగా కొవిడ్‌ పరీక్షలు చేయాలని చెప్పారు. అలాగే కిరాణా దుకాణాలు, హోటళ్లు, మార్కెట్లలోని వారు సైతం పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మరోవైపు వివాహాలతో పాటు ప్రజా సంబంధిత కార్యక్రమాలకు అనుమతి పొందడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కాగా, కేరళలో ఇవాళ ఒక్కరోజే 8,778 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 2,642 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 26 మంది వైరస్‌తో మరణించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని