ఉత్తరాఖండ్‌లో 2382 మంది పోలీసులకు కరోనా

తాజా వార్తలు

Updated : 03/06/2021 15:49 IST

ఉత్తరాఖండ్‌లో 2382 మంది పోలీసులకు కరోనా

* వీరిలో 93శాతం మందికి రెండుడోసుల టీకా పూర్తి

డెహ్రాడూన్‌: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా సేవలందిస్తున్న పోలీసులకు కరోనా మహమ్మారి మరిన్ని సవాళ్లు విసురుతోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో 2382 మంది పోలీసులుకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వీరిలో 93శాతం మంది రెండు డోసుల టీకా వేయించుకున్నట్లు ఆ రాష్ర్ట డిఐజీ నీలేష్‌ ఆనంద్‌ భర్నే తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. 'మిషన్ హౌస్లా' అనే డ్రైవ్‌ను రాష్ర్ట పోలీసుశాఖ గతనెల ప్రారంభించింది. ఇందులో భాగంగా కొవిడ్‌ బాధితులైన 2,726 మందికి ఆక్సిజన్ సిలిండర్లు, 792 మందికి ఆసుపత్రులలో పడకలు, 217 మందికి ప్లాస్మా, రక్తదానం తదితరాలను పోలీసులు అందేలా చేశారు. 17,609 మంది రోగులకు మందులు అందించారు. ఇవే కాకుండా, రేషన్, పాలు, వండిన ఆహారాన్ని అందించడం ద్వారా 94,484 మందిని ఆదుకున్నారు. అంబులెన్స్‌ల ఏర్పాటు, మృతదేహాల దహనంలోనూ పోలీసులు సహాయం చేస్తున్నారు. కాగా ఈ డ్రైవ్‌లో పాల్గొన్న 2382 మంది పోలీసుల్లో ఐదుగురితో పాటు వారి కుటుంబసభ్యుల్లో 64 మంది వైరస్‌కు బలయ్యారు. విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ర్ట ప్రజల రక్షణకోసం ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వర్తిస్తున్నారని ఎంతోమంది పోలీసులను ప్రశంసిస్తున్నారు. మొదటిదశలో 1982 మంది పోలీసులకు వైరస్‌ సోకగా.. 8 మంది మరణించారు. ప్రసుత్తం ఉత్తరాఖండ్‌ లాక్‌డౌన్‌ జూన్‌ 8 వరకు పొడిగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని