KK Aggarwal: డా. KK అగర్వాల్‌ కన్నుమూత!

తాజా వార్తలు

Updated : 18/05/2021 13:22 IST

KK Aggarwal: డా. KK అగర్వాల్‌ కన్నుమూత!

ఇంటర్నెట్‌డెస్క్‌: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కేకే అగర్వాల్‌ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన కరోనాతో బాధపడుతూ దిల్లీ ఎయిమ్స్‌లో గత వారం రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందతున్నారు.  ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఆయన వృత్తిరీత్యా హృద్రోగ నిపుణులు. ‘హార్ట్‌ కేర్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

చివరి వరకూ ప్రజల కోసం.. 

కొవిడ్‌ వ్యాప్తి చెందాక వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఆయన విశేషకృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి.. వారి ఆరోగ్య సమస్యలు విని ఔషధాలను సూచించారు. ఆయనకు కొవిడ్‌ సోకిన తర్వాత ఐదో రోజు సీటీ స్కాన్‌కు వెళుతూ కూడా ఆయన వీడియో చేసి.. పలువురు రోగుల సమస్యలను విని వారికి ఔషధాలు సూచించడంతోపాటు పలు జాగ్రత్తలు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన కొన్ని వందల వీడియోలు చేశారు. వీటిని దాదాపు 100 మిలియన్ల మంది వీక్షించారు.  

కొన్ని నెలల క్రితం అగర్వాల్‌ ఆన్‌లైన్‌లో ఉండగా.. ఆయన సతీమణి ఫోన్‌ చేసి తనను తీసుకెళ్లకుండా టీకా వేయించుకొన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. తన వీడియో టీకాపై అవగాహన కల్పిస్తే అంతకంటే ఏంకావాలని ఆయన హుందాగా పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని