Twitter: 8 వారాల గడువు ఇవ్వండి..

తాజా వార్తలు

Updated : 08/07/2021 15:14 IST

Twitter: 8 వారాల గడువు ఇవ్వండి..

దిల్లీ హైకోర్టుకు ట్విటర్ అభ్యర్థన

ఫిర్యాదులు స్వీకరించే అధికారి నియామకం విషయంలో..

దిల్లీ: భారత్‌లో ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించడానికి ట్విటర్ ఎనిమిది వారాల సమయాన్ని కోరింది. ఈ మేరకు గురువారం దిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధన అమలు విషయంలో ట్విటర్ ఇటీవల కోర్టు ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఐటీ నిబంధనల అమలు బాధ్యతలను చూసేందుకు జులై 6న భారత్‌కు చెందిన వ్యక్తిని తాత్కాలిక కాంప్లియన్స్ అధికారిని నియమించినట్లు సంస్థ కోర్టుకు వెల్లడించింది. అలాగే ఐటీ నిబంధనలకు అనుగుణంగా భారతదేశంలో అనుసంధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. 

నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విటర్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న  సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. దానిలో భాగంగా నూతన ఐటీ నిబంధనలను సంస్థ ధిక్కరించాలనుకుంటోందా? అని కోర్టు ప్రశ్నించగా.. ఇప్పటివరకు తాము నిబంధనలను అమలు చేయలేదని చెప్పింది. వాటి అమలుకు అవసరమైన ప్రక్రియను మొదలుపెట్టామని సమాధానమిచ్చింది. ఫిర్యాదులు స్వీకరించే అధికారి నియామకానికి నచ్చినన్ని రోజులు తీసుకుంటే కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో సంస్థ నుంచి తాజా స్పందన వెలువడింది. 

ఇదిలా ఉండగా.. ఇప్పటికే సురక్షిత ఆశ్రయం(సేఫ్ హార్బర్) అన్న రక్షణ కవచాన్ని ట్విటర్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కొత్త నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌలభ్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని ట్విటర్‌లో పోస్టు చేస్తే.. తృతీయ పక్షం కింద ఆ సంస్థపై భారతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. ఇప్పటికే సామాజిక మాధ్యమ సంస్థ ఆ తరహా కేసుల్ని ఎదుర్కొంటోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని