మరో ఏడు రాష్ట్రాల్లో ‘కొవాగ్జిన్‌’: కేంద్రం 

తాజా వార్తలు

Updated : 23/01/2021 21:32 IST

మరో ఏడు రాష్ట్రాల్లో ‘కొవాగ్జిన్‌’: కేంద్రం 

దిల్లీ: దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 15,37,190 మందికి టీకా పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే (సాయంత్రం 6గంటల వరకు) 1,46,459 మందికి టీకా వేసినట్టు తెలిపింది. ఈ మేరకు దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా 13 దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ జాబితాలో బెహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రెజిల్‌, మాల్దీవులు, మారిషస్‌, మంగోలియా, మొరాకో, మయన్మార్‌, నేపాల్‌, ఒమన్‌, సెచెల్లాస్‌, శ్రీలంకలు ఉన్నాయి. భారత్ బయోటెక్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ను ఇప్పటికే 12 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తుండగా.. అదనంగా మరో ఏడు రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. వచ్చేవారం నుంచి ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌లలో కూడా కొవాగ్జిన్‌ టీకాను ఉపయోగించనున్నట్టు తెలిపారు. మరోవైపు, ఏపీలో శనివారం 11,562 మంది టీకా వేయించుకున్నారు. 

ఆ మరణాలు టీకా వల్ల కాదు: కేంద్రం

దేశవ్యాప్తంగా ఈ ఎనిమిది రోజుల్లో వ్యాక్సిన్‌ వేయించుకొని ప్రతికూల ప్రభావం తలెత్తడంతో 11మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఆస్పత్రిపాలైన వారి శాతం 0.0007శాతంగా ఉన్నట్టు వివరించారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ఆరుగురు మృతిచెందినప్పటికీ.. వారి మరణాలకు టీకాతో సంబంధంలేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. తాజాగా హరియాణాలో ఒక మరణం సంభవించినప్పటికీ టీకాతో సంబంధంలేదని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. టీకా వేయించుకుని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఎవరి ఆరోగ్య పరిస్థితీ విషమించలేదని తెలిపారు.

ఇదీ చదవండి..

కొత్త రకం కరోనాతోనే అధిక మరణాలు!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని