భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం?

తాజా వార్తలు

Published : 21/12/2020 09:09 IST

భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం?

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అంచనా

దిల్లీ: జనవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. టీకా సామర్థ్యం, భద్రతకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భారత్‌లో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న టీకాలను సంబంధిత విభాగాలు క్షుణ్నంగా సమీక్షిస్తున్నాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన, తయారీ విషయంలో భారత్‌ మిగతా దేశాలతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. టీకా భద్రత, సామర్థ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అంతకుముందు శనివారం ఓ సందర్భంలో మాట్లాడుతూ.. కరోనా టీకాను దేశీయంగా తయారుచేసేందుకు మన శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎంతో కృషి చేశారని హర్షవర్ధన్‌ తెలిపారు. రానున్న 6-7 నెలల్లో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకా వేయనున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. భారత్‌లో కరోనాకు సంబంధించిన తొమ్మిది వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిలో ఆరు క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉండగా.. మరో మూడు ప్రీ క్లినికల్‌ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో కోటికి పైగా కేసులు నమోదుకాగా.. 1.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..

48 రోజులు కీలకం  

బ్రిటన్‌లో కొత్త కలవరం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని