చీమల్లో రెండు కొత్త ఉప జాతులు

ప్రధానాంశాలు

Updated : 24/01/2021 07:59 IST

చీమల్లో రెండు కొత్త ఉప జాతులు

 కేరళ, తమిళనాడులో గుర్తించిన శాస్త్రవేత్తలు

దిల్లీ: చీమల్లో రెండు కొత్త ఉప జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. కేరళ, తమిళనాడులో ఇవి వెలుగు చూశాయి. పంజాబీ విశ్వవిద్యాలయానికి చెందిన హిమేందర్‌ భారతీ నేతృతంలోని బృందం వీటిని గుర్తించింది. ఇందులో ఒక రకాన్ని కేరళలోని పెరియార్‌ టైగర్‌ రిజర్వులో కనుగొన్నారు. దీనికి ‘ఊసెరేయియా జోషి’ అని పేరు పెట్టారు. ప్రముఖ జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ అమితాబ్‌ జోషి పేరిట దీనికి నామకరణం చేశారు. యాంటెన్నా భాగాల సంఖ్య అంశంలో వీటికి.. మిగతా చీమ ఉప జాతులకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా వెలుగు చూసిన ఈ రెండు ఉప జాతులు.. ‘ఊసెరేయియా’ జాతికి సంబంధించినవేనని పేర్కొంది. ఈ జాతి కింద ప్రస్తుతం 14 చీమ రకాల చీమలు ఉన్నాయని తెలిపింది. వీటిలో ఎనిమిది రకాలకు 9 భాగాలతో కూడిన యాంటెన్నాలు ఉన్నాయని, ఐదింటికి 11 భాగాలు, ఒకదానికి 10 భాగాలు ఉన్నాయని వివరించింది. తాజాగా గుర్తించిన ఉపజాతులకు 10 భాగాలు ఉన్నాయని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన