
ప్రధానాంశాలు
5 లక్షల మరణాల దిశగా అమెరికా
మృతులకు నివాళులు అర్పించనున్న బైడెన్
వాషింగ్టన్: కరోనా వైరస్‌తో తీవ్రస్థాయిలో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మరో అవాంఛనీయ మైలురాయి దిశగా పయనిస్తోంది. ఆ దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 5 లక్షలు దాటనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.30 గంటల వరకు 4,98,897 మంది పౌరులు అమెరికాలో కరోనా కాటుకు బలయ్యారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ సంఖ్య అమెరికాలో 2019లో గుండెపోటు, మతిమరుపు వ్యాధి, ఫ్లూ, నిమోనియా, తీవ్రమైన శ్వాసకోస వ్యాధులతో సంభవించిన మరణాల సంఖ్య కంటే ఎక్కువ. ఇక అగ్రరాజ్యంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.81 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5 లక్షలు దాటిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌధంలో మౌనం పాటించడంతోపాటు, కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులు అర్పించనున్నారు. సూర్యాస్తమయం అనంతరం అధ్యక్షుడు మృతులకు సంతాపం తెలుపుతూ ప్రసంగిస్తారు. ప్రథమ మహిళ జిల్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆమె భర్త డగ్లస్ ఎంహాఫ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశముంది.
ప్రధానాంశాలు
సినిమా
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- నేడు భారత్ బంద్
- పెళ్లిపై స్పందించిన విశాల్
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- అయ్య స్పిన్నోయ్!
- మొతేరా గిరగిరా.. ఇంగ్లాండ్ గిలగిల
- డిపాజిట్..నెలనెలా వెనక్కి...
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- పిచ్‌తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
