కరోనా టీకాలపై పేటెంట్లు రద్దు చేయొద్దు

ప్రధానాంశాలు

Published : 22/05/2021 04:46 IST

కరోనా టీకాలపై పేటెంట్లు రద్దు చేయొద్దు

బైడెన్‌కు రిపబ్లికన్ల వినతి

వాషింగ్టన్‌: కరోనా టీకాలపై పేటెంట్‌ హక్కులు రద్దు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ తప్పుపట్టింది. దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వందకుపైగా రిపబ్లికన్‌ శాసనకర్తలు అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. టీకాలపై మేధో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌, దక్షిణాఫ్రికాలు ప్రతిపాదించగా, ఇందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్‌ తాయ్‌ మద్దతు తెలిపారు. దీనిపై రిపబ్లికన్లు అభ్యంతరం తెలుపుతూ ఇతరత్రా మార్గాల్లో ప్రపంచానికి టీకాలను అందుబాటులోకి తీసుకురావాలే తప్ప, ఇది మార్గం కాదని చెప్పారు. ఇలా చేస్తే అమెరికా ఆవిష్కరణలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే దశాబ్దాలుగా అమెరికా నూతన ఆవిష్కరణలను దొంగతనంగా పొందుతున్న చైనాకు ఉచితంగా అందజేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. చైనాతోపాటు రష్యా, భారత్‌లకు అప్పనంగా ఇచ్చినట్టవుతుందని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన