పేద దేశాలకు 50కోట్ల టీకా డోసులు: అమెరికా
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేద దేశాలకు 50కోట్ల టీకా డోసులు: అమెరికా

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అమెరికా భూరి విరాళాన్ని ప్రకటించనుంది. ప్రపంచంలోని 92 పేద, మధ్య అల్పాదాయ దేశాలకు 50 కోట్ల టీకా డోసులను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఫైజర్‌ కంపెనీకి చెందిన టీకాలను తామే కొనుగోలు చేసి ఆయా దేశాలకు సరఫరా చేస్తామని శ్వేతసౌధం గురువారం వెల్లడించింది. బ్రిటన్‌లో జరిగే జి-7 దేశాల సదస్సులో అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ మేరకు అధికారిక చేస్తారని తెలిపింది. కొవిడ్‌ నిర్మూలన కోసం ప్రపంచంలో మరే దేశమూ చేయనంత భారీ సాయాన్ని అమెరికా ప్రజలు తమ కర్తవ్యంగా అందిస్తున్నారని పేర్కొంది. మహమ్మారి బారి నుంచి మానవాళిని రక్షించుకోవాలన్నదే తమ విరాళ లక్ష్యమని తెలిపింది. రాబోయే రోజుల్లో చేపట్టబోయే మరిన్ని కార్యక్రమాలకు ఇది పునాది వంటిదని వివరించింది. ఆగస్టులో టీకాల సరఫరాను ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరికి 20 కోట్ల డోసులు, వచ్చే ఏడాది ప్రథమ అర్ధభాగం చివరకు 30 కోట్ల టీకా డోసులు పంపిణీ అవుతాయని శ్వేత సౌధం స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, టీకా కూటమి-గవి చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యాక్సిన్‌ సహకార వ్యవస్థ కొవాక్స్‌లో భాగంగానే తమ వితరణ ఉంటుందని వివరించింది. భారత్‌, బ్రెజిల్‌, పలు ఆఫ్రికా దేశాలకూ ఇవి అందే అవకాశం ఉంది. అమెరికా అవసరాలు తీరగా మిగిలిపోయే 8 కోట్ల టీకా డోసులను ఇతర దేశాలకు సరఫరా చేయనున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ప్రకటన వీటికి అదనం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన