శరణార్థుల పౌరసత్వ వివాదం కేసు విచారణ రెండు వారాలకు వాయిదా

ప్రధానాంశాలు

Updated : 16/06/2021 10:45 IST

శరణార్థుల పౌరసత్వ వివాదం కేసు విచారణ రెండు వారాలకు వాయిదా

దిల్లీ: ముస్లిమేతర శరణార్థుల పౌరసత్వ దరఖాస్తుల విషయమై ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను సుప్రీంకోర్టు మంగళవారం రెండు వారాలకు వాయిదా వేసింది. అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి వచ్చి గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, పంజాబ్‌లలో తలదాచుకుంటున్న ముస్లిమేతర శరణార్థులు భారత దేశ పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి తామిచ్చిన నోటిఫికేషన్‌కు పౌరసత్వ సవరణ చట్టం(2019)కి సంబంధంలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. పౌరసత్వ చట్టం(1955) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలను స్థానిక అధికారులకు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించగా...కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌కు సమాధానమిచ్చేందుకు రెండు వారాల గడువు కావాలని ఐయూఎంఎల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన