కుప్పకూలిన మూడంతస్తుల భవనం

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:41 IST

కుప్పకూలిన మూడంతస్తుల భవనం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బెంగళూరు నగరంలోని లక్కసంద్రలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. అందులో 20 కుటుంబాలు అద్దెకు ఉండేవి. నెల రోజుల కిందటే అత్యధికులు ఖాళీ చేశారు. సోమవారం ఉదయం భవంతి పక్కకు వాలటాన్ని గుర్తించిన స్థానికులు.. మిగిలిన మూడు కుటుంబాలను అప్రమత్తం చేశారు. వారు విలువైన వస్తువులు, సామగ్రి తీసుకుని బయటకు వచ్చిన గంటకు అది పూర్తిగా నేలమట్టమైంది. భవనం పాతది కావడం, పునాదుల్లోకి నీరు చేరడం, చుట్టుపక్కల భారీ భవనాలు నిర్మించడంతో ఇది కూలిపోయిందని యజమాని సురేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని ఆయన తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన