రివ్యూ, క్యురేటివ్‌ పిటిషన్ల విచారణ ప్రక్రియను సంస్కరించండి

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:49 IST

రివ్యూ, క్యురేటివ్‌ పిటిషన్ల విచారణ ప్రక్రియను సంస్కరించండి

సీజేఐ జస్టిస్‌ రమణకు గుంటూరు వాసి లేఖ

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టులో ప్రస్తుతం నడుస్తున్న రివ్యూ, క్యురేటివ్‌ పిటిషన్ల విచారణ ప్రక్రియను సంస్కరించి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని గుంటూరుకు చెందిన 85 ఏళ్ల న్యాయవాది పి.పరంధామయ్య ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణకు లేఖ రాశారు. న్యాయం కోసం ఏన్నో ఏళ్లుగా ఉగ్గబట్టుకొని ఉన్న వారు తమకు జరిగిన అన్యాయం గురించి చివరి దశలో రివ్యూ, క్యురేటివ్‌ పిటిషన్ల ద్వారా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని ఏ కారణం చూపకుండానే కొట్టేస్తున్నారని ఆయన సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. ‘మీరైనా ఈ ప్రక్రియను ప్రక్షాళన చేసి.. ప్రజలకు భరోసాను కల్పించాలి’ అని లేఖలో కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన