Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009731
            [news_title_telugu_html] => 

ఈడీ విచారణకు డీకే శివకుమార్‌ కుమార్తె

[news_title_telugu] => ఈడీ విచారణకు డీకే శివకుమార్‌ కుమార్తె [news_title_english] => Congress leader DK Shivakumars daughter appears before ED [news_short_description] => కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్య నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో... [news_tags_keywords] => DK Shivakumar,Aishwarya,Money Laundering Case,ED [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 14:21:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈడీ విచారణకు డీకే శివకుమార్‌ కుమార్తె - Congress leader DK Shivakumars daughter appears before ED - EENADU
close

తాజావార్తలు

ఈడీ విచారణకు డీకే శివకుమార్‌ కుమార్తె

దిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్య నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో శివకుమార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఇటీవల ఐశ్వర్యకు కూడా నోటీసులు అందాయి.  దీంతో ఆమె గురువారం దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. 

డీకే శివకుమార్‌ నిర్వహిస్తున్న ఓ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు 22ఏళ్ల ఐశ్వర్య ట్రస్టీగా ఉన్నారు. శివకుమార్‌ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో ఈ ట్రస్ట్‌కు సంబంధించిన పత్రాలు ఈడీ దృష్టికి వచ్చాయి. ఈ పత్రాల గురించి అధికారులు ఐశ్వర్యను ప్రశ్నించనున్నారు. 

మనీలాండరింగ్‌ కేసులో శివకుమార్‌ను ఈ నెల 3న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను దిల్లీ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 10 రోజుల కస్టడీకి అప్పగించింది.  2017 ఆగస్టులో దిల్లీలోని శివకుమార్‌ నివాసంలో ఐటీశాఖ అధికారులు సోదాలు చేసి రూ. 8.59కోట్ల లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.