టెస్టు జట్టులో పృథ్వీ, సూర్య

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:06 IST

టెస్టు జట్టులో పృథ్వీ, సూర్య

లండన్‌: ఓపెనర్‌ పృథ్వీ షా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లకు టీమ్‌ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో గాయపడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ల స్థానంలో పృథ్వీ, సూర్యలకు అవకాశం లభించింది. ఆగస్టు 4న ప్రారంభమయ్యే అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం వీరిద్దరు ఇంగ్లాండ్‌ వెళ్లనున్నారు. ఇప్పటి వరకు స్టాండ్‌బైగా ఉన్న బెంగాల్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను ప్రధాన జట్టులో చేర్చారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సమయంలో గాయపడిన గిల్‌ ఇప్పటికే స్వదేశం చేరుకున్నాడు. గాయాల కారణంగా సుందర్‌, స్టాండ్‌బై బౌలర్‌ అవేష్‌ఖాన్‌లూ ఇంగ్లాండ్‌ పర్యటనకు దూరమైనట్లు సోమవారం బీసీసీఐ ప్రకటించింది.

జట్టు: రోహిత్‌శర్మ, మయాంక్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, విహారి, పంత్‌, అశ్విన్‌, జడేజా, అక్షర్‌, బుమ్రా, ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి, సిరాజ్‌, శార్దూల్‌, ఉమేశ్‌యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌; స్టాండ్‌బై: ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్జాన్‌ నగ్వాస్‌వాలాTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన