Cricket News: క్రికెటర్‌ బరోట్‌ హఠాన్మరణం

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 08:46 IST

Cricket News: క్రికెటర్‌ బరోట్‌ హఠాన్మరణం

రాజ్‌కోట్‌: సౌరాష్ట్ర యువ క్రికెటర్‌ అవి బరోట్‌ ఆకస్మికంగా మృతి చెందాడు. శుక్రవారం అహ్మదాబాద్‌లోని తన నివాసంలో చెన్నై సూపర్‌కింగ్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య ఐపీఎల్‌ చూస్తుండగా 29 ఏళ్ల బరోట్‌ గుండెపోటుకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. బరోట్‌ ప్రస్తుతం భార్య, తల్లితో నివసిస్తున్నాడు. అతడి భార్య నాలుగు నెలల గర్భవతి. ‘‘బరోట్‌ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో తుది శ్వాస విడిచాడు. అతడి మరణాన్ని నమ్మలేకపోతున్నాడు. బరోట్‌ ఎంతో ప్రతిభావంతుడు. హరియాణా నుంచి సౌరాష్ట్రకు వచ్చి ఇక్కడ కెరీర్‌ ప్రారంభించాడు’’ అని సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు జయ్‌దేవ్‌ షా అన్నాడు. 38 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఈ కుడి చేతివాటం వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌.. 1547 పరుగులు చేశాడు. 38 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 1030 పరుగులు, 20 దేశవాళీ టీ20 మ్యాచ్‌ల్లో 717 పరుగులు సాధించాడు. 2015-16, 2018-19 సీజన్లలో రంజీ ట్రోఫీ ఫైనల్‌ చేరిన సౌరాష్ట్ర జట్టులో బరోట్‌ సభ్యుడు. 2011లో అండర్‌-19 భారత జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే సీజన్లో కూచ్‌ బెహర్‌ టోర్నీలో నాలుగు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు బాది జట్టు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన