దక్షిణాఫ్రికాలో ‘బీఎల్‌ఎం’ రగడ

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

దక్షిణాఫ్రికాలో ‘బీఎల్‌ఎం’ రగడ

మ్యాచ్‌ నుంచి తప్పుకున్న డికాక్‌

దుబాయ్‌: క్వింటన్‌ డికాక్‌.. దక్షిణాఫ్రికా జట్టులో అత్యంత కీలక ఆటగాళ్లలో ఒకడు. అతడికేమీ ఫిట్‌నెస్‌ సమస్యల్లేవు. డికాక్‌కు హఠాత్తుగా మానసిక, కుటుంబ పరమైన ఇబ్బందులేమీ కూడా తలెత్తలేదు. అయినా సరే.. టీ20 ప్రపంచకప్‌లో మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతను ఆడలేదు. ముందగా అతను వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం బయటికి వచ్చింది. అసలు కారణం ఆ తర్వాత బయటపడింది. నల్లజాతీయులపై వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచకప్‌లో వివిధ జట్ల ఆటగాళ్లు మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు కూడా విధిగా ఇదే తరహాలో ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ (బీఎల్‌ఎం) ఉద్యమానికి సంఘీభావం తెలపాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు నుంచి ఆదేశాలు అందడంతోనే డికాక్‌ ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. ఇంతకుముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్వచ్ఛందంగా బీఎల్‌ఎంకు మద్దతుగా సంఘీభావం తెలిపినపుడు డికాక్‌ వారిని అనుసరించలేదు. కెప్టెన్‌ బవుమా ఓ మ్యాచ్‌లో మోకాలిపై కూర్చోగా.. డికాక్‌ మామూలుగా నిలబడి ఉన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా బోర్డు.. బీఎల్‌ఎంకు మద్దతుగా జట్టు మొత్తం మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలపాలని ఆదేశాలు జారీ చేసిందని, ఆటగాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తుండటం పట్ల నిరసనతో డికాక్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. డికాక్‌ తనకు తానుగానే మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడా, బీఎల్‌ఎంకు మద్దతుగా సంఘీభావం తెలపనన్నందుకు అతణ్ని బోర్డే తప్పించిందా అన్నదానిపై కొంచెం సందిగ్ధత నెలకొంది.

డికాక్‌కు మద్దతిస్తాం: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలిపాలని తమ దేశ క్రికెట్‌ బోర్డు ఆదేశించడాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా తప్పుబట్టినట్లుగా మాట్లాడాడు. డికాక్‌కు జట్టు మద్దతుగా నిలుస్తుందని అతను ప్రకటించాడు.  ‘‘మ్యాచ్‌ ఆరంభానికి ముందు మాకు అందిన ఆదేశం సరైందిగా అనిపించలేదు. డికాక్‌ నిర్ణయం మాకు షాక్‌ లాంటిదే. అతను జట్టులో బ్యాట్స్‌మన్‌గానే కాక అన్ని రకాలుగా కీలక ఆటగాడు. డికాక్‌ చిన్నపిల్లాడేం కాదు. తనకేం చేయాలో తెలుసు. అతడి నిర్ణయాన్ని, తన నమ్మకాల్ని మేం గౌరవిస్తాం. క్వింటన్‌ ఇంకా మా బృందంలో ఒకడే. అతడికి అవసరమైన మద్దతు మా నుంచి అభిస్తుంది. సహచరుల నుంచి అతనేం కోరుకుంటే అది దక్కుతుంది’’ అని బవుమా అన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన