పిల్లలను బడులకు పంపేందుకు 48% తల్లిదండ్రుల విముఖత

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 07:44 IST

పిల్లలను బడులకు పంపేందుకు 48% తల్లిదండ్రుల విముఖత

దిల్లీ: పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అయ్యేంతవరకు వారిని బడులకు పంపేందుకు దాదాపు 48 శాతం మంది తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. లోకల్‌ సర్కిల్స్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ దేశవ్యాప్తంగా 361 జిల్లాల్లో 32 వేల మంది తల్లిదండ్రులతో ఈ సర్వేను నిర్వహించింది. పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించాలంటే రానున్న నెలల్లో వారికి టీకాలు వేయడం అత్యంత కీలకంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. తమ జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడితే పిల్లలను బడులకు పంపించేందుకు 30% మంది తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నారు. 21 శాతం మంది మాత్రం ఎప్పుడు స్కూళ్లు తెరిస్తే అప్పుడు పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించే అవకాశాలున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఈ నెలలో పాక్షికంగా పాఠశాలలు తెరిచారు. ఆగస్టు మొదటి వారంలో బడులు తెరవనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌లు ప్రకటించాయి. కొవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు తెరవాలా? వద్దా? అన్న విషయంలో తుది నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన