మరో రెండు రాకెట్ల బాధ్యత పరిశ్రమలకే

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

మరో రెండు రాకెట్ల బాధ్యత పరిశ్రమలకే

పీఎస్‌ఎల్‌వీకి మూడు బిడ్లు దాఖలు: ఎన్‌ఎస్‌ఐఎల్‌

బెంగళూరు: జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ల నిర్మాణ బాధ్యతను భారతీయ పరిశ్రమలకే అంతరిక్ష శాఖ అప్పగించనుంది. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ కూర్పు పనిని ఆ సంస్థలకు బదలాయించే పని మొదలైంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3కు సంబంధించి ఈ ఏడాది చివర్లోగా బిడ్లను ఆహ్వానించనున్నట్లు ఇస్రో వాణిజ్య విభాగం ‘న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) సీఎండీ డి.రాధాకృష్ణన్‌ తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ కోసం హెచ్‌ఏఎల్‌-ఎల్‌ అండ్‌ టీ, బీఈఎల్‌-అదానీ-బీఈఎంఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ నుంచి మూడు బిడ్లు వచ్చాయని చెప్పారు. వీటిపై సాంకేతిక-వాణిజ్య మదింపు చేపడుతున్నట్లు వివరించారు. 2 నెలల్లో దీన్ని పూర్తిచేసి, కాంట్రాక్టు విజేతను ప్రకటిస్తామన్నారు. చిన్నపాటి ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) మొదటి ప్రయోగం ఈ ఏడాది చివర్లోగా జరుగుతుందని ఆయన తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన