టర్కీ నోట మళ్లీ కశ్మీర్‌ మాట

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:28 IST

టర్కీ నోట మళ్లీ కశ్మీర్‌ మాట

నిబంధనలకు భిన్నంగా ఐరాసలో ఎర్దోగాన్‌ ప్రసంగం

ఐరాస: ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలన్న నిబంధనలను ఉల్లంఘిస్తూ టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగాన్‌ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు. మంగళవారం ఎర్దోగాన్‌ ప్రసంగిస్తూ..‘74 ఏళ్లుగా కశ్మీర్‌ సమస్య కొనసాగుతోంది. ఐరాస తీర్మానాలకు లోబడి చర్చల ద్వారా, శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని కోరుకుంటున్నాం’’ అంటూ ఈ అంశాన్ని సమావేశంలో లేవనెత్తేందుకు ప్రయత్నించారు. గత ఏడాది కూడా ఐరాస వేదికపై వినిపించిన వీడియో సందేశంలోనూ ఎర్దోగాన్‌ ఇదే విధంగా వ్యవహరించారు. అప్పుడు భారత్‌ తీవ్ర అభ్యంతరం చెప్పింది. టర్కీ వైఖరి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఖండించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన